ఎంపీటీసీ,జడ్పీటీసీల జీతాలు పెంపు…ఎమ్మెల్సీ కవిత హర్షం

181
mlc kavitha
- Advertisement -

జెడ్పీటీసీ, ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీతాల పెంపుపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జీతాల పెంపుపై ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు .

స్థానిక ‌సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు, సర్పంచ్ ల గౌరవ వేతనాన్ని 30% పెంచుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ‌ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యలు, నిధులు, విధులు వంటి‌ అంశాలపై ‌, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 12 మంది స్థానిక ‌సంస్థల‌ ఎమ్మెల్సీలు పలు సమావేశాలు జరిపి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -