ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన ఎంపిపి..

270
Mpp
- Advertisement -

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సింగిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపులో భాగంగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు ఎంపీ మరియు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మొక్కలు నాటడం వాటిని సం రక్షించడం వల్ల నేలతల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరితహారంకి మద్దతు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ, చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అతి తక్కువ కాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతా, ప్రజాదరణ పొందింది, ప్రాంతాలకు అతీతంగా, మొక్కలు నాటి వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటూ పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇలానే విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ కి, శాసనసభ్యులు రేగా కాంతారావుకి ఎంపిపి గుమ్మడి గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -