మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

148
Green Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ విసిరిన ఛాలంజ్ స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయ పార్క్ లో గురువారం 3 మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారి కృషి అభినందనీయం. చక్కని వాతారణం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం మొక్కలు నాటి, అవి ఎదిగే బాధ్యత తీసుకోవాలి. ఇది ఒక్కరితో అయ్యేపని కాదు. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో ముగ్గురికి జెడ్పీ సి.ఈ.ఓ.సన్యాసయ్య, డి.ఆర్.డి.ఏ. పీడీ విద్యాచందన, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగ్ రావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరి త్వరితగతిన మొక్కలు నాటాలన్నారు.