సీబీఐ, ఈడీ మీద నమ్మకం లేదు

236
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్లకు ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టితో గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో రాజ్యాంగం ఉందా రాజ్యాంగ సంస్థలు పనిచేస్తున్నాయ అందరికి తెలుసు.

మోడీ సీబీఐ మీద మోడీ ఈడి మీద మాకు నమ్మకం లేదని అన్నారు ఎంపీ వెంకటేష్. మునుగొడులో టీఆరెస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలన మాకు శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారు. మునుగోడు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. మునుగోడు నుండే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి శంఖారావం పూరించారని అన్నారు. మునుగోడు చరిత్రలో నిలిచిపోతుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ ఏవిధంగా అభివృద్ధి చేశారో దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. బిఅరెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారు. మునుగొడు ప్రజలు సీఎం కేసీఆర్ వెంట నడిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి నవ్వుల పాలయ్యారని విమర్శించారు.

 

ఇవి కూడా చదవండి

సునామీ భయంతో 80 మంది సజీవ సమాధి

అందుకే రాహుల్ గాంధీ చేయిపట్టుకున్నారు

వావ్.. చిరంజీవికి విద్యార్థుల అరుదైన గిఫ్ట్

- Advertisement -