కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను నిరాశపరిచిందన్నారు ఎంపీ సురేశ్ రెడ్డి. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడిన సురేశ్ రెడ్డి…90 నిమిషాల మంత్రి ప్రసంగం 90 కోట్ల మందిని వెలివేసిందన్నారు. మన్రేగాకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్నారు…గ్రామీణ కార్మికుల్లో విశ్వాసాన్ని ఎందుకు నింపడం లేదు?అని ప్రశ్నించారు. గ్రామాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి…వృథా అవుతుందన్న భయాందోళనలను తొలగించాల్సి ఉందన్నారు.
మన్రేగాను వ్యవసాయ రంగంతో లింకప్ చేయాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారు….దీని ద్వారా వృథా అవుతుందన్న అనుమానాలు నివృత్తి అవుతాయని, అందుకే వ్యవసాయ రంగంతో మన్రేగాను లింక్ చేయాలన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఇదో మంచి అవకాశం….గతంలో దుబాయ్‌కు వెళ్లే వారంతా ఇప్పుడు గ్రామాల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు.
కనీస మద్దతు ధర ఉంటుందని రైతులకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేసిన సురేశ్ రెడ్డి..డిమానిటైజేషన్, జీఎస్టీ ద్వారా ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో రుణం ఇవ్వనున్నట్లు కేంద్రం చెప్పిందని, కానీ రుణాలపై వడ్డీని తొలగించాలన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను స్వాగతిస్తున్నామని, కానీ కొన్ని ఆందోళనలు ఉన్నాయి…ఏపీ విభజనపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను డిస్టర్బ్ చేశాయన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం మేం 14 ఏళ్లు ఉద్యమం చేశాం…తెలంగాణ బిల్లు హౌజ్‌లో పాసైందంటే, పాసైనట్లే…ఎందుకుంటే చట్టాలకు పార్లమెంటే సుప్రీం అన్నారు. సభలో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు పాసైన విధానంపై ప్రధాని మోదీ ప్రశ్నలు లేవనెత్తడం సరికాదన్నారు. హౌజ్‌లో పాసైన బిల్లుపై ప్రశ్నించే అధికారం ప్రధానికి కూడా లేదన్నారు. విభజన వల్ల మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా అని ప్రధాని మోదీని ప్రశ్నించిన సురేశ్ రెడ్డి…ఒకవేళ వచ్చి ఉంటే మరెందుకు మేం అడిగిన డిమాండ్లను పరిష్కరించలేదు.? అన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి డిమాండ్లు వస్తున్నా.. వాటిని పరిష్కరించడం లేదని, ఆ డిమాండ్లను తిరస్కరిస్తున్నారన్నారు.