గొప్ప దార్శనికుడు పీవీ: ఎంపీ సురేశ్ రెడ్డి

109
suresh reddy
- Advertisement -

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా మాజీ ప్రధానమంత్రి పివి నర్సింహారావు శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీలు సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కె ఎమ్ సాహ్ని హాజరుకాగా పివి నర్సింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సురేశ్ రెడ్డి..దేశాన్ని, సమాజాన్నీ ముందుకు తీసుకుపోవాలని ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి పివి నర్సింహారావు అన్నారు.పివి నర్సింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు….పివి నరసింహా రావు ప్రతి ఆలోచన, పాలసీలను మరింత బలంగా మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని వెల్లడించారు.

ధరణి పాలసీని అమలు చేయడానికి అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి…తెలంగాణలో పెట్టుబడులు రావడానికి, లక్షలాది ఉద్యోగాలు ఏర్పడడానికి సీఎం కేసీఆర్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చారన్నారు. ఉత్సవాలు, వేడుకలే కాకుండా పివి నరసింహా రావు ఆలోచనలను అమలు చేస్తున్నాం. పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.

పివి నర్సింహారావు గొప్ప దార్శనికుడు అన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఈ దేశంలో అనేక సంస్కారణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహా రావు….తెలంగాణలో కూడా పెద్దఎత్తున భూ సంస్కరణలు తేవడం జరిగిందన్నారు. పివి నరసింహా రావుకు దేశంలో సరైన గుర్తింపు లభించలేదు.…ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహా రావు కు గుర్తింపు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పివికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై మా ఒత్తిడి కొనసాగుతుందన్నారు.

- Advertisement -