కృష్ణానది జలాల సమస్య పరిష్కరించండి: సురేష్ రెడ్డి

259
suresh reddy
- Advertisement -

కృష్ణా న‌ది జ‌లాల పంప‌క విష‌యంలో ఏర్ప‌డ్డ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ సురేష్ రెడ్డి. రాజ్యసభలో మాట్లాడిన ఆయన నీటి కోస‌మే తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని చేప‌ట్టారని గుర్తుచేశారు.

అంతరాష్ట్ర నీటి చట్టాల ప్రకారం సెక్షన్ 3లోని సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ …ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జ‌ల‌శ‌క్తి మంత్రికి, కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు కూడా లేఖ‌లు రాసిన‌ట్లు తెలిపారు.

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదని కృష్ణా న‌ది నీటి పంప‌కం స‌మ‌స్య‌ను బ్రిజేశ్ ప్యానెల్‌కు రిఫ‌ర్ చేయ‌డం వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్నారు. ఆరేళ్ల నుంచి ఏపీతో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -