వెల్దుర్తి చిన్నారులను అభినందించిన ఎంపీ సంతోష్..

45
MP Santosh

వెల్దుర్తి పిల్లల పర్యావరణ చైతన్యాన్ని తెలుసుకున్న ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.అద్భుతమైన పని చేస్తున్నారంటూ పిల్లలను అభినందిస్తూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోందని అన్నారు.పర్యావరణ సమతుల్యత పరంగా మెరుగైన భవిష్యత్ కోసం ఇలాంటి యువతరం మరింతగా ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోటా కింద బస్తీలోని పిల్లలు చేసిన మంచిపని అబ్బుర పరుస్తోంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా తమ వంతుగా వినూత్న ప్రయత్నం చేశారు. గత వారం రోజుల నుండి వర్షాలు పడక పోవడంతో తెలంగాణకు హరితహారం,పల్లె ప్రగతిలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నాటిన మొక్కలను రక్షించేందుకు చిన్న పిల్లలు ముందుకు వచ్చారు. తమ సైకిల్‌కు డబ్బా కట్టి అందులో నీళ్లు నింపి ప్రతి మొక్కకు నీళ్లు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.