ఐఒసిఎల్‌ ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్..

505
mp santhosh kumar
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్తాత్మకంగా ప్రారంబించిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జపానులో ప్రజాధరణ పొందిన మియావాకి పద్దతిలో అటవీ పునరుద్దరణ కార్యక్రమాన్నీ జీహెచ్‌యంసీ సహకారంతో హైదరబాద్ సెంట్రల్ యూనివెర్సిటీ, గచ్ఛీబౌలిలో ముఖ్యమంత్రి కల్వకుకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజైన పిబ్రవరి 17న ప్రారంబించండమైనది.

green challenge​ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిదిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు కార్యక్రమ మెంటర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. జీహెచ్‌యంసీ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్, పద్మభూషణ్ పుల్లెల గోపిచంద్ ఇతర కార్పొరేటర్లు, ఇండియన్ ఆయిల్ సీనియర్ అధికారి ఎస్.ఎస్.ప్రసాద్, మనీష్ టస్కర్, సీ.జీ.యం.రామ్మోహన్ మరియు జోనల్ కమిషనర్ ఎన్.రవి కిరణ్, డెప్యూటి డైరెక్టర్ కే.నీరజ గాంధీ మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఇందులో భాగంగా బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కింద మొక్కలు నాటడం జరిగింది. ఈ రోజు శెరిలింగంపల్లి జొన్ పరిదిలో 19 ప్రదేశాల్లో 1711 మొక్కలు నాటడం జరిగింది. అలాగే 15000 మొక్కలు ఉచితంగ పంపిణి చేశారు.

mp santhosh

​అంతరించిపోతున్న అడవుల పునరుద్దరణ దిశగా ప్రముఖ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ముందుకు రావడం గమనార్హం. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం…రానున్న రోజుల్లో మరింతగా విస్తరించి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెద్ద పెద్ద సంస్థలకు కూడా స్పూర్తినింపతుందని తద్వారా పచ్చదనాన్ని పెంచడానికి మరింత దోహద పడుతుందని ఆశిద్దాం.

- Advertisement -