దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బంధీగా అమలు చేస్తూ సర్వజనుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు సీఎం కేసీఆర్.
లాక్ డౌన్‌తో తెలంగాణలో ఎవరు పస్తులు ఉండకూడదని వలస కూలీలతో పాటు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు రూ. 1500ని అందిస్తోంది ప్రభుత్వం.
చేతికి పైకమొచ్చింది..మోములో ఆనందం విరిసింది అంటూ ఓ పెద్దాయన చేతికి ప్రభుత్వం అందించిన సాయం రాగానే సంతోషంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్ధితిలో రూ. 1500 వస్తే ఆ ఆనందం ఇలానే ఉంటుంది అంటూ సంగారెడ్డికి చెందిన శివరాజ్ అనే పెద్దాయన డబ్బు తీసుకున్న అనంతరం వాటిని లెక్కపెట్టకుంటూ మురిసిపోయిన ఫోటోను షేర్ చేసిన సంతోష్..అద్భుతం …ఇంతకంటే ఏం కావాలి..ఇది సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Reflections of the deeds of an able #Leader.
As per the orders of Hon’ble CM #KCR sir, the authorities have transferred an amount of 1500/- to
all the white ration card holders.Awesome to see this smiling elderly person got the cash from the bank.#DildarCM #StaySafeEveryone pic.twitter.com/azGsMz3wMm
— Santosh Kumar J (@MPsantoshtrs) April 16, 2020