- Advertisement -
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటంతో రివర్ బేసిన్ ను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పలువురు అధికారులు వచ్చారు. కాళేశ్వరం పర్యటన అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. స్వామివారి ఆశ్వీవచనాలు తీసుకున్నారు. అనంతరం స్వామి ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రసాదం అందజేశారు పూజారులు.
- Advertisement -