సీఎం జగన్ ,మంత్రి కేటీఆర్ తో ఎంపీ సంతోష్ సెల్ఫీ

571
mp Santhosh Kumar Ys Jagan
- Advertisement -

ప్రగతిభవన్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ముందుగా ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. మధ్యాహ్న భోజనం అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు.

కాగా ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ తీసుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదీజలాలు, విద్యుత్‌ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది.

- Advertisement -