MP Santhosh:దటీజ్ కేసీఆర్

59
- Advertisement -

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో తుటి ఎముక విరిగి మాజీ సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని యావత్ తెలంగాణ సమాజం ప్రార్ధిస్తుండగా గులాబీ బాస్ ఆరోగ్యంపై ఎంపీ సంతోష్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆస్పత్రిలో బెడ్‌పై పడుకుని.. ఓ పుస్తకాన్ని చదువుతున్నారు. ఆ సమయంలో ఆయన్ను ఫోటో తీసిన ఎంపీ సంతోష్ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజయమైన నాయకత్వం క్లిష్ట సమయాల్లోనూ రెట్టించి ఉత్సాహంతో పని చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. పఠనంలో లీనమైపోయిన విధానం చూస్తుంటే.. పఠనం, జ్ఞానం పట్ల ఆయన అభిరుచిని తెలియజేస్తుంది. అంకితభావం, స్థితిస్థాపకతను తెలియజేస్తుంది. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆలోచనలన్నీ మీతోనే ఉన్నాయి అని పేర్కొన్నారు.

Also Read:దళారీ..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -