దీపాలు వెలిగిద్దాం.. సమైక్యత చాటుదాం: ఎంపీ సంతోష్‌

230
trs santhosh

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఇవాళ రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ప్రజలు దీపాలు వెలిగించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

ఈ నేపథ్యంలో రండి…దీపాలు వెలిగిద్దా..సమైక్యత చాటుదామని  పిలుపునిచ్చారు ఎంపీ సంతోష్ కుమార్. దీపాలు వెలిగించేందుకు రోడ్లపైకి రావొద్దని ఇళ్లలో లేదా బాల్కనీలలో ఉండి దీపాలు,టార్చ్‌లైట్ వెలిగించాలన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తద్వారా మాత్రమే ఆరోగ్య భారత్ సాధ్యమవుతుందన్నారు.