సుదీర్ఘ ప్రయాణంలో ..కేసీఆర్ వెంటే..: ఎంపీ సంతోష్

236
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యంలో ఎగిరిన గులాబీ జెండా నేటికి ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకుని రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ వేదికగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. 19 ఏళ్ల క్రితం నాటి ఫోటోను షేర్ చేసిన సంతోష్…జలదృశ్యం నుండి నేటి వరకు కేసీఆర్‌తోనే తన ప్రయాణం సాగిందని తెలిపారు.

ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నానని..ఎప్పుడు నిరుత్సాహానికి గురికాలేదన్నారు. ఈ ప్రయాణంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఎప్పటికి గుర్తిండిపోతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు సంతోష్.

santhosh

- Advertisement -