చాలా బాధాకరం..నా దృష్టికి తీసుకురండి… ఎంపీ సంతోష్

367
trs
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మరోసారి తన  సేవాగుణాన్ని చాటుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గ్రీన్ ఛాలెంజ్ ను స్ధాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. తాజాగా మరో సంఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు ఎంపీ సంతోష్ కుమార్. న్యూస్ పేపర్లో వార్తను చూసి ఆయన చలించిపోయారు. మహబూబాబాద్ జిల్లా గూడురు జిల్లా పరిషత్ బాలకల పాఠశాలలో సుమారు 130మంది చదువుకుంటున్నారు.

అయితే వీరందరికి ఒకే మూత్రశాల ఉంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు క్యూ నిల్చుని ఉన్నారు. ఈ వార్త సాక్షి పేపర్ లో రావడంతో ఎంపీ సంతోష్ కుమార్ పేపర్ చూసి స్పందించారు. ఇది చాలా బాధాకరమైన విషయం.. ఆ సమస్య పరిష్కరించేందుకు తాను ఎంపి నిధుల నుంచి తగినన్ని డబ్బులు ఇస్తానని..ఈ ఇష్యూ గురించి వీలైనంత తొందరగా తనను సంప్రదించాలని సాక్షి, టీన్యూస్, టీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్ చేశారు.

- Advertisement -