మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఎంపీ సంతోష్ కుమార్. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సీఎం కేసీఆర్ కళలను నిజం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే అందరూ నాటిన మొక్కలను సంరక్షించాలని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కోరారు.
కరీంనగర్‌లో 6వ విడిత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి గంగుల కమలాకర్. సూర్యాపేటలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ ములోని 9 వ వార్డ్ లోని పార్క్ లో మొక్కలు నాటారు మంత్రి జగదీష్ రెడ్డి.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్ గ్రామంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి హరిత తెలంగాణనే సీఎం కెసిఆర్ ధ్యేయం…చెట్లను సమృద్ధిగా పెంచితేనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. హరిత హారం కార్యక్రమానికి ప్రతి గ్రామపంచాయతీ నుండి పది శాతం నిధులు వాడుకోవచ్చన్నారు.