రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకూ తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని స్వాగతించారు ఎంపీ సంతోష్ కుమార్.
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్..సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. లాక్ డౌన్ విషయంలో ఎలాంటి సడలింపు ఇచ్చిన పరిస్థితి చేజారుతుందని అందుకే ఏప్రిల్ 20 తర్వాత ఎలాంటి సడలింపులు ఇవ్వలేదన్నారు.
కేంద్రం సడలింపులు ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో సడలింపులు ఉండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పరిస్థితులను బట్టి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం కూడా చెప్పింది. ఈ మేరకే నిర్ణయం తీసుకున్నామని… కంటైన్మెంట్ జోన్లలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
An absolute perspicuity decision of our people’s leader #KCR sir as usual, This is how he understands his people & gauge the situation.
Any exemption to the #Lockdown would definitely prove fatal. Let us not hamper the fight against #Covid19 in the name of relaxation.#StayHome pic.twitter.com/Jl3ptKs3sN
— Santosh Kumar J (@MPsantoshtrs) April 19, 2020