కళాతపస్వీ, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించి మొక్కలు నాటినందుకు ఇవాళ సాయంత్రం విశ్వనాథ్ ఇంటికి వెళ్లి కృతజ్నతలు తెలియజేశారు. హరితహారం కార్యక్రమానికి సహాకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా గ్రీన్ ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు సంతోష్ కుమార్ ను అభినందించారు. కాగా రెండు రోజుల క్రితం దర్శకుడు కె. విశ్వనాథ్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.
Called on Kalatapasvi Sri Vishwanath garu, and thanked him personally for participating in #GreenIndiaChallenge. He said he has done this, as it carries a very good message and will help building a sustainable environment for future generations in a true sense 🌱🌳.#Respect pic.twitter.com/ykqiZJrItW
— Santosh Kumar J (@MPsantoshtrs) November 2, 2019