బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్

445
mp Santhosh
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు గుర్తింపుగా మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సీఎం కేసీఆర్ బర్త్ డే పురస్కరించుకుని బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

అనంతరం ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ శేషు కుమారి , టి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బల్కంపేటకు చేరుకున్న ఎంపీ సంతోష్ కుమర్ కు టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -