రైతు కూలీలకు అండగా ఎంపీ సంతోష్.. 2వ రోజు అన్నదానం..

117
annadanam
- Advertisement -

దేశానికి వెన్నెముక రైతులు. లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుంబిగించారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు ముఖ్యఅతిథిగా కరీంనగర్ జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్ కరీంనగర్ మార్కెట్ కార్యాలయం ముందు రైతు కూలీలకు అందరికీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాన కార్యక్రమం కోసం మార్కెట్ కమిటీ ఎంచుకోవడం చాలా మంచి నిర్ణయం. ప్రతి రోజు చాలా మంది రైతు కూలీలు ఇక్కడ వస్తుంటారు అని అన్నారు. ఇది లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతు కూలీలు కాకుండా ఇతర పేద వారికి కూడా అన్నదానం చేస్తున్నామన్నారు.

ఇంత మంచి కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి రైతు కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేటర్స్, టిఆర్ఎస్ నాయకులు మరియు బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య మరియు ఎలుక అనిత ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మైన్, అనుచరులు చాట్లపల్లి పురుషోత్తం పాల్గొన్నారు.

- Advertisement -