నిర్విరామంగా ఎంపీ సంతోష్‌ అన్నదాన కార్యక్రమం..

541
mp santhosh
- Advertisement -

సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎంపీ సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదాన కార్యక్రమం ప్రతి రోజు కొనసాగుతోంది. వలస కూలీల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్నీ జడ్పీటీసీ ఉమకొండయ్య ప్రారంబించారు. సంతోష్ కుమార్ పేరు మీద ఈరోజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కుదురుపాక గ్రామంలో సుమారు వంద మందికి అన్నదానం చెయ్యడం జరిగింది .

ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం వచ్చిన వలసకూలీలకు స్థానిక ప్రజాప్రతినిధులు భోజనం వడ్డించారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ వలస కూలీల కడుపు నింపేందుకు ముందుకు రావడం అభినందనీయమని స్థానిక ప్రజలు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు అందిస్తుందని తెలిపారు. అయినప్పట్టికీ కొన్ని కారాణాల వాళ్ళ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందని కార్మికులు,వలస కూలీలు ఆకలితో అలమటించకుండా అన్నదానంతో తన దాతృత్వాన్ని చాటు కున్నాడని కొనియాడారు.

food distribution

సుమారు రెండు, మూడు వేల మంది వలస కార్మికుల కడుపు నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ కు పేద ప్రజల దీవెనలు, సీఎం కేసీఅర్ అండదండలు ఎప్పుడు ఉంటాయని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో బోల్లవేణి భానుశ్రీ, తిరుపతి యాదవ్ మాజీ ఎంపీటీసీ, ఎస్‌ఐ శ్రీనివాస్,ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీ రాములు, గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చిక్కాల సుధాకర్ రావు, ఎంపీటీసీలు, సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు స్థానికి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -