ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్…

506
Revanth Reddy
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్ వేవ్ కొనసాగుతోందని హెల్త్ శాఖ తెలపగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ ధరంచాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

కొవిడ్ ప‌రీక్ష‌ల్లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని, వైద్యుల సూచ‌న మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రేవంత్ రెడ్డి. రీసెంట్‌గా త‌న‌ను క‌లిసిన వారంతా ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా కొవిడ్ టెస్టు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

- Advertisement -