- Advertisement -
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలను ఉపయోగించడంతో రేవంత్‌తో పాటు అతని సోదరుడు కృష్ణారెడ్డి,విజయ్ పాల్ రెడ్డి, ప్రవీణ్ పాల్ రెడ్డి,విజయ్ సింహారెడ్డి,రాజేశ్‌లపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఇప్పటికే నార్సింగి పోలీసులు ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయ్‌సింహారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్ (డ్రోన్ ఆపరేటర్), శివ, ఓం ప్రకాశ్‌రెడ్డిను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వీరందరీపై 224/2020లో సెక్షన్ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్ విత్ 5ఏ కింద కేసు నమోదుచేశారు.
- Advertisement -

