హైదరాబాద్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి..

394
MP Ranjith Reddy
- Advertisement -

హైదరాబాద్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి అని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ డా.రంజిత్‌ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగు యువత ఎక్కువగా ఉంది. ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ నైపుణ్యాభివృద్ధి ముఖ్యమన్నారు.జర్మనీ, కొరియాల్లో ఉన్న విధంగా మన దేశంలోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు లీగల్‌ బ్యాంకింగ్‌ చేయడం ద్వారా విద్యాహక్కు మాదిరిగా నైపుణ్య హక్కును పొందగలుగుతారు. ప్రస్తుతం దేశంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ముంబై, అహ్మదాబాద్, కాన్పూర్‌ల్లో ఉన్నాయని, దక్షిణ భారతదేశానికి ఉపయోగపడేలా హైదరాబాద్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు.

ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి డా.మహేంద్రనాథ్‌ పాండే సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనూ నైపుణ్యాభివృద్ధికి అనుబంధంగా ఉన్న సంస్థలపై కేంద్రం ఇప్పటికే దృష్టిపెట్టిందన్నారు పాండే. ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయాలని అనేక రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామన్నారు. దక్షిణభారతదేశంలోని ఐటీఐలకు ప్రోత్సాహకాలిస్తున్నామని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల విషయంలో రాష్ట్రప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే.

- Advertisement -