ఐటీ ఐఆర్ ను 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..2008లో కేంద్రం లో బీజేపీ అధికారంలో లేదు, రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో లేదు..మేము అధికారంలోకి వచ్చాక ఐటిఐఆర్ కోసం లెక్కలేనన్ని సార్లు కేంద్ర మంత్రులను కలిశాం అని తెలిపారు ఎంపీ రంజిత్ రెడ్డి.ఐటిఐఆర్ విషయం లో నిర్లక్ష్యం గా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాదు… కేంద్ర ప్రభుత్వం ఇది బండి సంజయ్ గమనించాలి ..హైదరాబాద్ ఐటీ సిటీ ఆఫ్ ఇండియా అని కేంద్ర ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పలేదా..హైదరాబాద్ కు ఐటీఐఆర్ చాలా అవసరం ..బండి సంజయ్ వాస్తవాలు మాట్లాడడం పక్కన పెట్టి ..అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఒక సీఎం కు లేఖ రాసేముందు వాస్తవ సమాచారం తెలుసుకోవడం అవసరం..తెలంగాణ లో బీజేపీ కి కూడా 4 ఎంపీ లు ఉన్నారు కదా ..మరి మీరెందుకు పార్లమెంట్ లు ఐటీఐఆర్ గురించి మాట్లాడరు..దేశం బాగుండాలంటే బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేంద్రం సపోర్ట్ చేస్తే సరిపోదు..అభివృద్ధి లో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రోత్సాహకం అవసరం..ఐటీఐఆర్ తేవడం మాకు చేతకాలేదు మేము తేలేదు… కర్ణాటక లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ..అక్కడ ఏంధుకు ఐటీఐఆర్ తేలేదు..మేము చెప్పిన విషయం లో తప్పుంటే చర్చించడానికి సిద్ధం.. మీరు చర్చ కు ఎక్కడికి రమ్మన్నా వస్తాం అన్నారు.
బండి సంజయ్ మొదటి నుంచి రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారు..గొడవలు ,కొట్లాటలు సృష్టించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు…చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని బండి సంజయ్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమైనా చెప్పాడో సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే వివేకానంద్.దుబ్బాక లో చిన్న సంఘటనలు పెద్దచేసి ఎన్నికల్లో లబ్ది పొందారు..జనగామ లో ఫ్లెక్సీల పంచాయతీ కి సీఎం సమాధానం చెప్పాలంటారు..హుజూర్ నగర్ లో యస్టీ లను రెచ్చగొట్టారు…ప్రతీ చిన్న విషయానికి సీఎం సమాధానం చెప్పాలా..బండి సంజయ్ లాంటి వాళ్ళను టిఆర్ఎస్ పార్టీ చాలా మందిని చూసింది..ఎంతో మంది టిఆర్ఎస్ పార్టీ ముందు కాలగర్భంలో కలసిపోయారని దుయ్యబట్టారు.
బీజేపీ జోకర్ పార్టీ కాస్తా మెంటల్ పార్టీ గా మారింది..బండి సంజయ్ ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని అమిత్ షా ,మోడీ లకు విన్నవిస్తున్నా అన్నారు జీవన్ రెడ్డి.2008 ఐటీఐఆర్ ను యూపీఏ ప్రభుత్వం ఆమోదిస్తే…2008 తర్వాత 7సంవంత్సరాలు కేంద్రం లో ,రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏంధుకు అమలు చేయలేదు..కాంగ్రెస్ దర్వాజలు తవ్వుకుపోతుంటె ,బీజేపీ కిటికీలు తవ్వుకుపోతుంది…పార్లమెంట్ సాక్షిగా ఐటీఐఆర్ ను ఆపేసామని కేంద్ర ఐటీ మంత్రి సభాముఖంగా అన్నాడు.. ధీనికి బీజేపీ నేత లు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
ఐటీఐఆర్ కోసం మంత్రి కేటీఆర్ 14 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసాడు..కావాలంటే బీజేపీ నేతలకు ఈ లేఖలు పంపిస్తాం..రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఐటీఐఆర్ కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా ..కేంద్రం నుంచి స్పందన లేదు..బీజేపీ ప్రభుత్వానికి చేతకాక మా పై ఆరోపణలు చేస్తున్నారు ..రచ్చగొట్టడం తప్ప బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు..యువతను రెచ్చగొట్టేందుకు ట్రిపుల్ రైడింగ్ చేయండి అని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ కాంట్రవర్సీ స్టేట్ మెంట్ లు చేస్తడు..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉధ్యోగాల లెక్క ను మీముందు ఉంచాం …డౌటు ఉంటె ప్రశ్నించండి అంటె ..ఉధ్యోగాలే ఇవ్వలేదంటారు..తప్పుడు మాటలు మాట్లాడడంలో బండి సంజయ్ నెంబర్ 1..బీజేపీ పాలిత రాష్ర్టాలలో ప్రభుత్వం ఇచ్చిన ఉధ్యోగాలు ఎన్నో బండి సంజయ్ లెక్కలు బయట పెట్టాలి..టీ పీసీసీ ,టీ బీజేపీ ఉందంటే ..అది కేసీఆర్ దయ…మమ్మల్ని రెచ్చగొడితే ..మా సంగతి ఏంటో చూపిస్తాం..మేము తలుచుకుంటే బీజేపీ నేతలు బయట తిరగలేరు..ప్రభుత్వం హామీ ఇచ్చి చేయని పనులు ఉంటె ప్రశ్నించండి …అంతే కానీ అనవసర విషయాల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు..ధర్మపురి అరవింద్ పుట్టిందే అవినీతి లో …పెరిగింది అవినీతి లో అని మండిపడ్డారు.