సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో ఎంపీ రంజిత్ రెడ్డి భేటీ ..

20
arikapudi gandhi

లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తో స్థానిక చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరికేపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నే శ్రీనివాస్ రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లాంజ్ లో సుమారు అరగంట పాటు చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల పలు రైల్వే సమస్యలపై చర్చించారు. రైల్వే సమస్యలు ప్రజల సమ్మతి తో తీర్చాలని కోరారు.ఈ సందర్భంగా పలు సమస్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరికేపూడి గాంధీ, కార్పొరేటర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు.