ఓ వైపు గాంధీ..మరోవైపు గాడ్సే:రాహుల్

32
- Advertisement -

అమెరికా వేదికగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎంపీ రాహుల్ గాంధీ. భారతదేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం ఉందని… ఒకటి మనం (కాంగ్రెస్) ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొకటి బీజేపీ – ఆర్ఎస్ఎస్ భావజాలం. అయితే, ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకవైపు మహాత్మా గాంధీ, మరోవైపు నాథూరామ్ గాడ్సే అని మండిపడ్డారు.

భవిష్యత్తును చూసే సత్తా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు లేదని, దేశంలో అవి విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. యూఎస్‌లో భారతీయ – అమెరికన్ కమ్యూనిటీ వారు జీవిస్తున్న తీరును రాహుల్ ప్రశంసించారు. భారతదేశం నుంచి ఉద్భవించిన దిగ్గజాలందరూ కొన్ని లక్షణాలను కలిగి ఉన్నారని అన్నారు.

Also Read:పర్యావరణ దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్

ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు 50ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఏం చేసిందో చెబుతారు.. అదీ వారి సిద్ధాంతం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి గతాన్ని తోడుతూ భవిష్యత్తులో మరోసారి తప్పు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై బీజేపీ దృష్టిసారించదన్నారు.

Also Read:నిద్ర‌కు ముందు గ్రీన్ టీ తాగితే..?

- Advertisement -