- Advertisement -
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదు అన్నారు ఎంపీ రఘునందన్ రావు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేది అన్నారు.
కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుంది.. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి అన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విశేషం.ఈ విషయమై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ఏపీ సీఎంకు లేఖ కూడా రాశారు. టీటీడీ అధికారుల తీరును ఎండగట్టారు.
Also Read:హరీష్ రావుకు హైడ్రా బాధితుల హోలీ విషెస్
- Advertisement -