ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన బృహత్తర కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇందులో భాగంగా ప్రతి ఏటా కోట్ల మొక్కలను నాటుతూ సంరంక్షించడం జరుగుతుంది. మానవాళి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హరితహారం. కేసీఆర్ హరితహారానికి కొనసాగింపు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టారు. హరితహారాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. మానవసహిత అడవుల నిర్మాణానికి ఇది తోడ్పడుతుంది. ఇది తెలంగాణ సమాజానికే కాదు మానవాళికి మేలు చేసే కార్యక్రమం ఇది. కొత్తతరం గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి ముందుకు తీసుకుపోవాలి.

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్‌తో కలిసి మంత్రుల నివాస సముదాయంలోని తన క్వార్టర్‌లో మూడు మొక్కలు నాటారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇందులో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ సమతుల్యతకు గ్రీన్ ఛాలెంజ్ అవసరం. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయం అని న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ నేను మొక్కలు నాటాను. మరో ముగ్గురు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసురుతున్నాను అని ఎంపీ తెలిపారు. న్యూజిలాండ్‌లో ఎంపీ మైకేల్ వుడ్, భారత్ లోని స్నేహితులు కళ్యాణ్ కాసుగంటి, సునిత విజయ్ కోస్లాలను న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ నామినేట్ చేశారు.

