ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..

19
- Advertisement -

ఎట్టకేలకు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. జర్మనీ నుండి బెంగళూరు చేరుకున్న ప్రజ్వల్‌ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.ఆయన వద్ద ఉన్న రెండు స్కూట్ కేసులను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన అనంతరం విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీయే కూటమి తరపున హాసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి రేవణ్ణ పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వీడియోలు వైరల్‌గా మారడంతో జర్మనీ పారిపోయారు ప్రజ్వల్.

రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ తో పాటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులుసైతం జారీ అయ్యాయి. దేవెగౌడ తో పాటు రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ సీఎం కుమారస్వామి..ప్రజ్వల్‌ని లొంగిపోవాలని సూచించగా మే 31న పోలీసుల విచారణకు హాజరవుతానని రేవణ్ణ తెలిపారు. గురువారం రాత్రి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోదిగగా అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read:సాధువుగా మారిన మోడీ..

- Advertisement -