ఈరోజు పార్లమెంట్‌లో 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్ సభలో టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు. ఓబీసీ రాజ్యంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు నామా తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈ రాజ్యంగ సవరణ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బిల్లను టీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తూ మద్దతు పలుకుతుంది. తెలంగాణలో ఓబీసీల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ అనేక కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని నామా పేర్కొన్నారు.
రైతుల కోసం ఎకరానికి 10 వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అలాగే రైతు బంధు తరహాలో తాజాగా దళిత బంధు ఫథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నారు నామా. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి పదిలక్షల రూపాయలు మా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంది. దళితుల అభ్యున్నతి మా ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో దళిత బంధు పథకం ఒకటి ఎంపీ నామా తెలిపారు.