- Advertisement -
జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన నామా …రూ. 5 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్పందన లేదన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఆలస్యం కావడంతో పథకాల అమలుకు ఆటంకం కలుగుతుందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
- Advertisement -