ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదే: ఎంపీ నామా

90
nama
- Advertisement -

ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. లోక్ స‌భ‌లో తెలంగాణ‌ వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌ సమస్యను లేవ‌నెత్తారు టీఆర్ఎస్ లోక్ స‌భ ప‌క్ష నేత నామా నాగేశ్వ‌ర్ రావు.

తెలంగాణ‌లో నీటి స‌దుపాయం, ఉచిత విద్యుత్, రైతుబందు ఇస్తున్నాం అని తెలిపిన నామా….వ‌రి దిగుబ‌డుల్లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ గా ఉందన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా దిగుబ‌డి పెరిగిందన్నారు. రైతులు కేంద్రం తీరుతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారని తెలిపారు.

- Advertisement -