తెలంగాణ నీటి కష్టాలు తీర్చేందుకే కాళేశ్వరం: నామా

331
nama
- Advertisement -

తెలంగాణలో నీటి కష్టాలు తీర్చేందుకే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు ఎంపీ నామా నాగేశ్వరరావు. లోక్ సభలో అంతరాష్ట్ర నది జలాల వివాదాల సవరణ బిల్లు -2019పై జరిగిన చర్చలో మాట్లాడిన నామా ఈ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. 33ఏండ్లుగా ఉన్న అంతర్‌రాష్ట్ర నదీ జలాల సమస్యను సీఎం కేసీఆర్‌ మూడేళ్లలో పరిష్కరించారని చెప్పారు. నదుల్లోని నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నేషనల్‌ వాటర్‌ పాలసీని తీసుకురావాలని సూచించారు.

సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం దేశంలో సుమారు 70వేల టీఎంసీల నీరు నదుల్లోంచి సముద్రాల్లోకి వృథాగా వెళ్తోంది. దేశంలో 40వేల టీఎంసీల నీళ్లు సాగుకు, 10వేల టీఎంసీల నీళ్లు తాగునీటికి, పరిశ్రమల అవసరాలకు సరిపోతాయని చెప్పారు.

- Advertisement -