విభజన సమస్యలపై పార్లమెంట్ లో పోరాడుతాం

601
nama nageshwar rao
- Advertisement -

రాష్ట్ర విభజన సమస్యలపై పార్లమెంట్ లో ప్రధాని మోదీని నిలదీస్తామన్నారు టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు . ఢిల్లీలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, వివిధ పార్టీల నేతలు పాల్గోన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావులు హాజరయ్యారు.

ఈసందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. గత సెషన్స్ మాదిరిగానే ఈ సెషన్స్ కు కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 27 బిల్లులు పెడతామని చెప్పారు. బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్నారు.

ఆర్థికమాంద్యం, జిడిపి గ్రోత్ పడిపోతుంది. కాలుష్యం, నిరుద్యోగులు, రైతులు అంశం పై చర్చ జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సమావేశాల్లో లెవనెత్తుతం. సీఎం కేసీఆర్ స్వయంగా ఎన్నో అంశాలపై విజ్ఞప్తులు చేసిన స్పందన లేదని చెప్పారు. కొత్త రాష్ట్రానికి సహకారం అందించాల్సిన కేంద్రం అన్ని అంశాలను పెండింగ్ లో పెడుతుందని తెలిపారు.

- Advertisement -