రాజకీయాల్లోకి శ్రీరెడ్డి…ప్రముఖ పార్టీలో చేరిక?

430
Sri-Reddy-

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. పలువురు నటులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళనాడులో ఉంటుంది. కొన్ని తమిళ్ సినిమాల్లో నటిస్తు బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఆమె ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో మాట్లాడారు. సినిమాల్లో అవకాశాల కోసం తాను గతంలో తప్పులు చేశానని, ఇకపై అలా చేయబోనని తెలిపింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్న ప్రయత్నాల్లో తానున్నానని, తనను ఆదరిస్తున్న తమిళ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రానున్నానని అన్నారు.

తన పేరుతో సోషల్ మీడియాలో కొంత మంది ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తమిళ నటుడు ఉదయనిధిపై ఆరోపణలు చేస్తూ, తాను ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఉదయనిధిని తాను ఎన్నడూ నేరుగా కలవలేదని స్పష్టం చేశారు. ఎవరో నకిలీ ఖాతాను సృష్టించి, పనిగట్టుకుని తన పేరిట ఉదయనిధిపై ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు.

తమిళనాట అడుగుపెడితే నిన్ను చంపేస్తామంటూ స్టాలిన్ అభిమానులు శ్రీ రెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తమిళ ప్రజలు తనను చాలా ఆరాధిస్తున్నారని అందుకే త్వరలోనే అక్కడే రాజకీయ రంగప్రవేశం చేస్తానని చెప్పింది . వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రముఖ పార్టీ తరఫు నుంచి టికెట్ సంపాదించి పోటీ చేస్తానని చెప్పింది. ఎక్కడినుంచి పోటీ చేయాలి? ఏ పార్టీలో చేరుతారనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపింది శ్రీరెడ్డి.

Actor Srireddy entry In Politics.. Srireddy Complaint on social Media Activist