రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి- ఎంపీ కవిత

241
mp kavitha
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు చేయాలి. ఇందు కోసం రాష్ట్రంలో 335 ఎకరాల భూమిని సర్వే చేసి సిద్ధంగా ఉంచామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవిత. ఈ రోజు జరిగిన లోక్‌సభ సమావేశాల్లో జీరో అవర్‌లో ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడారు. 2016–17 బడ్జెట్‌లో గిరిజన విశ్వవిద్యాలయ పనులు ప్రారంభించేందుకు రూ.10కోట్ల మూలధనాన్ని కేటాయించింది. ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారని కవిత తెలిపారు.

తెలంగాణ సంస్కృతిలో గిరిజన సాంప్రదాయాలు కీలకమైన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ములుగు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు 335 ఎకరాల భూమి గుర్తించింది. 2019–20 నుంచి యూనివర్సిటీలో విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండేళ్ళవుతున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభంకాలేదని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

- Advertisement -