గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎంపీ మాలోత్ కవిత..

390
MP Maloth Kavitha
- Advertisement -

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఎంపీ మాలోత్ కవిత మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్బంగా మొక్కలు నాటుతున్నాని, అయితే తన ముందు ఎదుగుతున్న తీరు చూసి తనకు ఆనందాన్ని ఇస్తుంది అని, ఆ స్ఫూర్తితో ఎక్కువ మొక్కలు నాటుతానని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హరితమ్మ, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, కేఎస్‌ఎన్‌ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, నవీన్ రావు , పొన్నాల యూగేందర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -