మంత్రి కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ..

49
minister ktr

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ రోజు తెలంగాణ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ కార్యకర్తలను కలిసేందుకు మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. కేటీఆర్‌కు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, స్టేషన్‌ ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మంత్రిని కలిశారు. పలువురు కార్పొరేటర్లు, ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.