టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నోటుకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని తెలంగాణ పీసీసీ ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌పై ఆరోపణలు చేశారు. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు చేరుకున్న వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…టీపీసీసీ కాస్త టీటీడీపీగా మారిపోయిందన్నారు.
ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీ వెళ్లాకగానీ తేలియలేదన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను త్వరలోనే బయటపెట్టనున్నట్లు తెలిపారు. రాబోయే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాల్సిందిగా ఘాటైన కామెంట్స్ చేశారు.
రేపటి నుండి ఇబ్రహింపట్నం మొదలుకొని భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ప్రజల మధ్యనే ఉంటూ కొత్త నాయకులను, కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తానన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.