ఇవాళ ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు అంతా టీవీలు చూడండి అని వనపర్తి సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఏ ప్రకటన చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాఉఉ.
నిరుద్యోగుల కోసం ప్రకటన చేస్తానని కేసీఆర్ అనడం సంతోషాన్ని కలిగించింది.. రాష్ట్ర ప్రజలలో ఒకడిగా నేను ఆ ప్రకటన కోసం వేచి చూస్తున్నాను అని తెలిపారు కోమటిరెడ్డిఅన్నారు. రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులు నిరుద్యోగభృతి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఖాళీగా ఉన్న లక్షా తొంభైవేల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్ ప్రకటిస్తారని అనుకుంటున్నానని.. ఉపాధ్యాయుల, DSC నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక ఏజీ లిమిట్ అయిపోయిన వారి కోసం కూడా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు. మేం ఆశించినట్టు ప్రకటన చేస్తే మీ ఫొటోకు పాలాభిషేకం చేస్తాను అని ప్రకటించారు.