- Advertisement -
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఉదయం సభలో నిర్మాణాత్మక మార్గం గురించి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు అన్నారు.
పార్టీలకు అతీతంగా విబేధాలను పార్లమెంటు బయటే వదిలిపెట్టాలని, దేశ భవిష్యత్ కోసం పనిచేయాలని మంచి సందేశం ఇచ్చిన వ్యక్తి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. నిజంగా ఆరోగ్య సమస్యలతోనే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసి ఉంటే ఆయన త్వరగా కోలుకోవాలి అని తెలిపారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022 జులై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానికి, రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:టీటీడీ పాలకమండలి సమావేశం
- Advertisement -

