సీఎం పేరు తెల్వనోడు యాంకరా?: కాంగ్రెస్ ఎంపీ

6
- Advertisement -

తెలుగు మహా సభల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్‌ బాలాదిత్యపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలవని వాళ్లు యాంకర్ అవుతారా అంటూ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఏ సీఎం వస్తున్నడో తెలియకుండా యాంకర్‌ చదువుతడా అని విమర్శించారు.

హైదరాబాద్‌ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు బాలాదిత్య ఆహ్వానించారు. అప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్‌కుమార్‌ గారు అంటూ ఉచ్ఛరించి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పేరును చెప్పగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్!

- Advertisement -