వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టం: ఎంపీ కేకే

225
keshavarao

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం జరగుతుందన్నారు ఎంపీ కే కేశవరావు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన రాజ్యాంగ విరుద్దంగా కేంద్రం వ్యవసాయ బిల్లును రూపొందించిందని రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ప్రశ్నించారు.

రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా.. మార్కెటింగ్‌ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.