అనంత పద్మనాభస్వామి సన్నిధిలో ఎంపీ కవిత

229
mp kavitha
- Advertisement -

కేరళ అసెంబ్లీ వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లిన ఎంపీ కవిత బిజిబిజిగా పర్యటిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు ట్రావెన్ కోర్ మహారాణి గౌరి లక్ష్మీ భాయి మరియు ప్రిన్స్ ఆదిత్య వర్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరువనంతపురంలోని కౌడియర్ ప్యాలెస్‌కు వెళ్లిన కవితను మహారాణి సాదరంగా ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా పోచంపల్లి శాలువాను మహారాణి లక్ష్మీబాయికి అందజేశారు కవిత. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను మహారాణి గౌరీ లక్ష్మీ భాయి కవితని అడిగి తెలుసుకున్నారు.శయనిస్తున్న పద్భనాభ స్వామి వారి ప్రతిమతో పాటు ఆమె రాసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర, వైశిష్ట్యం గురించి రాసిన పుస్తకాన్ని మహారాణి లక్ష్మీబాయి ఎంపి కవితకు బహూకరించారు.

mp kavitha
అనంతరం పలు అంశాలపై వారిరువురూ చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్,గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాల కృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు.

mp kavitha

mp kavitha

- Advertisement -