మహిళా సాధికారతకు పెద్దపీట:కవిత

205
MP Kavitha Speech on International Women's Day
- Advertisement -

తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ కవిత కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళ సమస్యలపై మగవారు మాట్లాడితేనే పరిష్కారమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళల వెనుకబాటు తనం పొగొట్టడానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు.తెలంగాణలో ఉన్న పేద ఆడబిడ్డల కోసం కులంతో సంబందం లేకుండా కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆడవారిపై పేరుపైనే ఇవ్వాలని కోరానని సీఎం కేసీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించారన్నారు. మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో పూర్తిస్ధాయి ప్రాధాన్యం కల్పించామని.. మార్కెట్ కమిటీల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని  స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ పనిచేసిన మహిళలకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన మహిళలకు సముచిత గుర్తింపునిచ్చేందుకు  సీఎం కేసీఆర్ కమిటీ వేశారని కమిటీ రిపోర్టు ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.

మహిళలు అన్ని రంగాల్లో సాధికారికత సాధించుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అవకాశాలు వస్తే మహిళలు అద్భుతాన్ని సృష్టిసారని  డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. కుటుంబంలో ఆడపిల్లల పట్ల వివక్ష చూపించకూడదని.. భ్రూణ హత్యలు లేకండా ఉండేందుకు కృషిచేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ ,సునీత మహేందర్ రెడ్డితో పాటు పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వివిధ రకాల ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.

- Advertisement -