ఉమెన్స్ డే గిఫ్ట్: నామినేటెడ్ పోస్టులు

159
CM KCR Wishes International Women's Day
- Advertisement -

రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు.

పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు … . తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన మహిళలకు కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో కమిటీ ఏర్పాటైంది. కమిటీ నివేదిక అందించిన వెంటనే నామినేటెడ్ పోస్టుల నియామకం జరగనుంది. కమిటీ నివేదిక రాగానే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

- Advertisement -