తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఎదురులేని పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడానికి పలు పార్టీల నేతలు మొగ్గుచూపుతున్నారు. తాజాగా.. టీఆర్‌ఎస్ లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మంత్రి పోచారం, ఎంపీలు కవిత,బిబి పాటల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, హన్మంత్ షిండే సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గంనకుచెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్‌ఎస్ లో చేరారు.
కాగా.. ఈ కర్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ..బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌తో చేతులు కలపడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. కాగా..ప్రజా సమస్యలకోసం పోరాడే నరసింహనాయుడు టీఆర్‌ఎస్‌లో సముచిత స్థానముంటుందని చెప్పారు.
రాబోయే ఎన్నికల కోసం, రాబోయో తరాలకోసం మనమంతా పనిచేస్తున్నామని కేసీఆర్ ఎప్పుడూ గుర్తుచేస్తూనేఉంటారని వెల్లడించారు. అంతేకాకుండా.. పోచారం శ్రీనివాస్ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి రైతులకు మంచిరోజులొచ్చాయని తెలిపారు. కాగా..తెలంగాణ అభివృద్దికోసం పాటు పడేవారిని ఆహ్వానించడానికి టీఆర్‌ఎస్ ఎప్పుడూ సిద్దంగానేఉంటుందని తెలిపారు.