తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక అయ్యారు.. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపికయ్యారు. ఈ నెల 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు.
ఎంపీగా కవిత లోక్ సభలో పలు అంశాలపై తన ఆలోచనలను నిర్భయంగా పంచుకుంటున్నారు. పలు అంశాలపై అనర్గళంగా ప్రసంగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పలు సంఘాలకు అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారు. ‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలిగా కవితకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది.
మహిళ సాధికారిత కోసం కవిత విశేష కృషి చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా తెలంగాణ జాగృతి 3 రోజుల పాటు నిర్వహించిన ‘అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు’లో ఆమె కీలక ప్రసంగం చేశారు.